సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : గురువారం, 25 జులై 2019 (13:11 IST)

బాత్రూమ్‌లో అద్దం పెట్టుకోవచ్చా?

పూర్వంలో మరుగుదొడ్లు నివసించే ఇంటికి దూరంగా ఉండేవి. స్నానపు గదులే కాదు... కాలకృత్యం తీర్చుకునే మరుగుదొడ్డి కూడా దూరంగా ఉండేది. అయితే, ఇపుడు ఇంట్లోనే ఒకటి రెండు బాత్రూమ్‌లను నిర్మించుకుంటున్నారు. పడక గదికి అనుబంధంగా ఒకటి, హాలుకు అనుబంధంగా మరొకటి, బయట ఇంకొకటి ఇలా ఒకే ఆవరణలో అన్నీ వుంటున్నాయి. అయితే చాలా మంది బాత్రూమ్‌లలో అద్దాలు పెట్టుకుంటారు. ఇలా అద్దాలు పెట్టుకోవచ్చా? లేదా అన్నది వాస్తు నిపుణులను సంప్రదిస్తే, 
 
గతంలో టాయిలెట్లు ఇంటికి దూరంగా ఉండేవి. పైగా మరుగుదొడ్లు వేరుగా స్నానాల గది వేరుగా కట్టి అందులో వేడి నీటికి పొయ్యి బాయిలర్ అమర్చేవారు. అలా ఇంటి అంతర ఆవరణ గొప్ప శుద్ధిని కలిగి ఉండేది. అలా మరుగుదొడ్ల వ్యవస్థ వేరుగా ఇండిపెండెంటుగా ఉండేది. ఇప్పుడు లెట్రిన్, స్నానాల గది కలిసిపోయాయి. ఇదంతా స్థలాభావం వల్ల వచ్చిన ఒత్తిడి. ఇది గొప్పదని కాదు. తప్పని స్థితి. 
 
ఇక ఇలాంటి పరిస్థితిలో వాటిల్లో అవసరాలకు అద్దాలు బిగిస్తున్నారు. అద్దాలు పెట్టుకొని వాడటం తప్పుకాదు. అందులో షేవింగ్ వంటి పనులు చేసుకోవచ్చు. దానికి తగిన అద్దం వాష్ బేసిన్ పెట్టొచ్చు. కానీ బ్రష్షింగ్ (పండ్లు తోమే బ్రష్‌లు) చేసుకోవడం మంచిది కాదు. కేవలం స్నానాల గది ఒక్కటే ఉంటే అందులో అన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి బాత్‌రూమ్‌లో అద్దం పెట్టుకోవచ్చు. అది మన అంతరంగ వ్యవస్థను రూపుదిద్దుతుంది.