1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 జూన్ 2022 (15:24 IST)

పెళ్లికాని వారి బెడ్ రూమ్‌లో ఇవి వుంటే.. అంతే సంగతులు

Bed room
పెళ్లికాని వారి పడకగదిలో ఇలాంటి వస్తువులు వుండకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. వివాహం కాకపోతే, పొరపాటున బెడ్‌రూమ్‌లో టీవీ, కంప్యూటర్‌ను ఉంచవద్దని వారు తెలిపారు. ఎందుకంటే ఇది కమ్యూనికేషన్‌లో చాలా సమస్యలను కలిగిస్తుంది.  
 
అలాగే మ్యారేజ్ కానివారి బెడ్ కిటికీ లేదా గోడకు ఆనుకుని ఉండకూడదట. దీనివలన అమ్మాయి జీవితంలో చిన్న చిన్న సమస్యలు రావడమే కాకుండా నెగెటివిటి పెరుగుతుంది. పెళ్లికాని వారి బెడ్ రూమ్‌లో నది, చెరువుకు సంబంధించిన చిత్రాలు ఉండకూడదు.  
 
అలాగే మాస్టర్ బెడ్ రూమ్ వాస్తు ప్రకారం ఇంటి యొక్క నైరుతి మూలలో ఉండాలి. ఈ గదిని ఇంటి యజమాని  ఉపయోగించాలి. 
 
మాస్టర్ బెడ్ రూమ్ ఎల్లప్పుడూ ఇంటిలోని ఇతర గదుల కంటే పెద్దదిగా ఉండాలి. ఇల్లు బహుళ అంతస్తులు అయితే పై అంతస్తులోని నైరుతి మూలలో మాస్టర్ బెడ్ రూమ్ ఉత్తమం. 
 
ఈ గదిలో నిద్రించేటప్పుడు వ్యక్తి యొక్క తల దక్షిణం లేదా పడమర వైపు వుండాలి. కాళ్లు ఉత్తరం లేదా తూర్పు దిశగా ఉంటాయని వాస్తు నిపుణులు అంటున్నారు.