శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (20:21 IST)

కొత్త చీపురు కొనుగోలుకు ఏ రోజు మంచిది..?

Broomstick
Broomstick
కొత్త చీపురు కొనడానికి వాస్తు నియమాలు కూడా ఉన్నాయి. చీపురుని ఎల్లప్పుడూ మంగళవారం, శనివారం, అమావాస్యల రోజుల్లో కొనుగోలు చేయాలి.
 
ముఖ్యంగా కృష్ణ పక్షంలో కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో చీపురు పెట్టుకునే ప్రదేశం ఎవ్వరూ నేరుగా చూడలేని విధంగా ఉండాలి. చీపురు ఎక్కడ ఉంచినా పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
 
పాత చీపురును ఇంట్లో ఎప్పుడూ ఉంచవద్దు. చీపురు పాతబడితే ఇంట్లో పెట్టుకోకూడదని.. ఇలా పాత చీపురని ఇంట్లో ఉంచడం వలన ప్రతికూలత వస్తుందని అంటారు. శనివారం లేదా అమావాస్య రోజున పాత చీపురుని ఇంటి నుండి తీసివేయాలి. 
 
ఇంట్లోని పాత చీపురును తీసివేస్తే ఆ ఇంటి దారిద్ర్యం కూడా తొలగిపోతుందని.. తద్వారా ఇంట్లో సానుకూలత ఏర్పడుతుందని నమ్మకం.
 
పాత చీపురుని శనివారం, అమావాస్య రోజులో మాత్రమే కాదు.. గ్రహణం తర్వాత ,హోలికా దహనం తర్వాత కూడా పాత చీపురుని ఇంటి నుంచి తొలగించవచ్చు. 
 
అయితే ఎప్పుడూ ఏకాదశి, గురువారం, శుక్రవారం నాడు పాత చీపురు ఇంటి నుంచి బయటకు విసరకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు.