గురువారం, 14 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : శనివారం, 27 అక్టోబరు 2018 (13:28 IST)

ఇంటి వెనుకవైపు మెట్రోరైల్ మార్గం.. ఏం చేయాలి..?

ఇల్లు కట్టుకున్నాం.. కానీ, వెనుకవైపు మెట్రోరైల్ మార్గం ఉంది. ఏం చేయాలి.. పక్కవాళ్ల ఇంటికి వెళ్ళాలంటే.. కష్టం. అందుకని ఇంటిని వదలేసి వెళ్లలేం కదా. అందుకే ఇంటిని ప్రవారీలు పెట్టి కట్టుకోవాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఒకవేళ మీ ఇంటి వెనుక భాగంలో మెట్రోరైల్... పడమర, దక్షిణ భాగాల్లో ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కనుక మీరు బాధపడవలసిన అవసరం లేదు.
  
 
అలానే ఈ దిశల్లో కాకుండా మిగిలిన దిక్కుల్లో వచ్చిదంటే.. తప్పనిసరిగా ఆ దిశకు దూరంగా ఉండడమే మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటి చుట్టుప్రక్కల మెట్రోరైల్ వచ్చిందని.. వెంటనే ఇంటిని మార్చాలని మాత్రం ఎప్పుడూ అనుకోకండి.. ఏదేమైనా మీరు కట్టుకున్న ఇల్లు వాస్తు ప్రకారమే ఉంటుంది. కనుక మెట్రోరైల్ పడమర, దక్షిణ దిశల్లోనే ఉంటుంది. ఇలా ఉండడం కూడా ఒకందుకు మంచిదేనని వారు చెప్తున్నారు.