శనివారం, 4 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2023 (10:32 IST)

వాస్తు టిప్స్.. సూర్యోదయం నిద్ర వద్దు.. వంటగదిలో ఖాళీ బకెట్‌ వుంచితే?

వాస్తు దోషాలు దూరం కావాలంటే ఇంట్లో ఈ పనులు చేయకూడదు. సూర్యోదయం తర్వాత ఎప్పుడూ నిద్రపోకూడదు. ఇంటిని శుభ్రంగా వుంచుకోవాలి. అలాగే ఇంట మురికి బట్టలు వుంచకూడదు. మురికి బట్టలు ధరించకూడదు. ఉదయం పూట బ్రష్ చేయకుండా ఏ పని చేయకూడదు.  
 
ఇంట పరుష పదాలు వాడకూడదు. ఎప్పుడూ మధురంగా ​​మాట్లాడండి. సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి మధ్య స్త్రీ పురుషులు సంభోగం చేయరాదు. రోజు స్త్రీ పురుషులు సంభోగం చేసే చోట లక్ష్మి నివాసం ఉండదు. సాధారణంగా మనం నిద్రపోయేటప్పుడు తమ చేతి గడియారాన్ని దిండు కింద పెట్టుకోవడం చూస్తుంటాం, కానీ వాస్తు శాస్త్రం ప్రకారం వాచీని ఎప్పుడూ దిండు కింద పెట్టకూడదు.
 
సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం ద్వారా లక్ష్మి మాత అనుగ్రహం కురుస్తుంది. ఇల్లు సిరిసంపదలతో నిండి ఉంటుంది. ఇంటి ప్రధాన ప్రదేశం వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగదిలో మురికి పాత్రలు ఉంచడం సరికాదు. మురికి పాత్రలను ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. అందుకే ఎప్పుడూ రాత్రిపూట పాత్రలు శుభ్రం చేసిన తర్వాతే నిద్రపోవాలి.
 
రాత్రి సమయంలో బాత్రూంలో ఖాళీ బకెట్ ఎప్పుడూ ఉంచవద్దు, అది ప్రతికూలతను తెస్తుంది. అదే సమయంలో, వంటగదిలో ఖాళీ బకెట్ ఉంచడం అశుభం. వంటగదిలో బకెట్ నిండా నీళ్లు ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమవుతాయని విశ్వాసం. దీంతో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా వుంటాయని వాస్తు నిపుణులు అంటున్నారు. 
 
సాయంత్రం పూట ఎప్పుడూ దానధర్మాలు చేయకూడదు. అది పేదరికాన్ని కూడా తెస్తుంది. అంతే కాకుండా పాలు, పెరుగు, ఉప్పు సాయంత్రం పూట ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది.