టీవీని ఏ దిక్కున వుంచి చూడాలి? (video)
టీవీ స్టాండుపైన టివిని వుంచి హాలులో ఉత్తరం, తూర్పు భాగాలలో టీవిని వుంచడం మంచిది. హాలులో గృహస్తులు దక్షిణ లేదా నైరుతి భాగాలలో కూర్చుని టీవీని వీక్షించడం మంచిది.
టీవీ నైరుతి భాగంలో వుంచడం వల్ల గృహస్తులు దీనికి వ్యతిరేక దిశలో కూర్చుని నైరుతి భాగాన్ని ఎక్కువగా చూస్తుంటారు. ఇది అంత మంచిది కాదు. నైరుతిలో టీవీని వుంచినట్లయితే దీనికి వ్యతిరేక దిశలో ఫర్నీచర్ పెడతారు. అంటే ఈశాన్యంలో ఫర్నీచర్ వుంటుందన్నమాట.
గృహస్తులు ఎప్పటికీ దక్షిణం, పశ్చిమ, నైరుతి భాగాలలో కూర్చోవడం మంచిది.