గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2019 (16:33 IST)

కార్న్ పకోడి తయారీ విధానం

పాఠశాలలకు వెళ్లే పిల్లలు సాయంత్రం ఇంటికి వస్తూనే చిరుతిండ్లు కావాలని మారాం చేస్తుంటారు. అలాంటప్పుడు ఈ కార్న్ పకోడి చేసి పెట్టండి. హేపీగా లాగించేస్తారు.

కావలసిన వస్తువులు
బేబీ కార్న్- పది, సెనగపిండి- ముప్పావుకప్పు, పసుపు- పావుటీస్పూన్, కారం- అరటీస్పూన్, ఉప్పు- తగినంత, నూనె- సరిపడా, ఛాట్ మసాలా- కొద్దిగా, అల్లంవెల్లుల్లి పేస్టు- ఒకటీస్పూన్, జీలకర్రపొడి- అరటీస్పూన్, ధనియాల పొడి- ఒకటీస్పూన్.
తయారీ విధానం
ముందుగా బేబీకార్న్ కండెలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేయాలి. వాటిని నీళ్లలో కాసేపు ఉడికించాలి. తరువాత నీళ్లు తీసేసి కార్న్ పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో సెనగపిండి తీసుకొని పసుపు, కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. మిశ్రమం చిక్కగా ఉండేలా చూసుకోవాలి.
 
ఈ మిశ్రమంలో ఉడికించిన కార్న్ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఈ కార్న్ ముక్కలు వేస్తూ డీప్ ఫ్రై చేయాలి. ఛాట్ మసాలా చల్లుకుని సర్వ్ చేసుకోవాలి.