మీ కనుబొమలు అందంగా ఉండాలంటే.. ఇవిగో కొన్ని చిట్కాలు?
మహిళలకు అందాన్ని చేకూర్చేవి కనుబొమలు. ఆ కనుబొమలను ఎంత అందంగా ఉంచుకుంటే మహిళలకు అంత అందం చేకూరుతుంది. ముఖం కోడిగుడ్డు ఆకారములో వున్నవారికి చివర్లు ట్రిమ్‌గా ఉండి మధ్యలో దట్టంగా వున్న కనుబొమలు బాగుంటాయని బ్యూటీషన్లు చెబుతున్నారు.
అలాగే ముఖం చదరంగా ఉండి గడ్డం కొనదేలి ఉన్నవాళ్ళకు సన్నటి పొడవాటి కనుబొమలు వుంటే అందంగా కనిపిస్తారు. కనుబొమలు చివర్లు సూదిలా షార్ప్‌గా వుండాలి. గుండ్రటి ముఖం కలవారికి పొడుగాటి కనుబొమలు చివరలు కిందవంపు మెలితిరిగివుంటే బాగుంటుంది.
చతురస్రాకారపు ముఖం కలవారికి కనుబొమలు చిన్నగా, అర్థచంద్రాకారంలో వుండేటట్లు షేప్ చేసుకోవాలి. కనుబొమలు దట్టముగా వుండి మధ్యలో కొంచెం వంపు తిరిగి వుండాలి.
త్రిభుజాకారపు ముఖం కలవారికి కనుబొమలు మందంగా తిన్నగా వుండాలి. 1/4 వంతు కనుబొమ కిందకు వంగి వుండాలి. పొడుగాటి ముక్కున్నవాళ్ళు కనుబొమ్మల్ని మరీసన్నగా షేప్‌చేసుకోకూడదు. అలా చేసినట్లైతే కళ్ళు చిన్నవిగా కనిపిస్తాయని బ్యూటీషన్లు సూచిస్తున్నారు.