శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 14 మే 2019 (16:01 IST)

ఖర్జూర పండ్లు తిని వేడి నీరు తాగితే వెన్నునొప్పి...?

నడుము నొప్పి చాలా మందికి వచ్చే సమస్య, రోజంతా కుర్చీలో కూర్చుని పనిచేయడం, శ్రమతో కూడిన పనులు చేయడం మరియు ఇతరత్రా కారణాల వలన నడుము నొప్పి వస్తుంది.


స్త్రీలలో నడుము నొప్పి సర్వసాధారణంగా వస్తుంటుంది. 35 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాగే మీరు కూడా వెన్ను నొప్పితో బాధపడుతుంటే కొన్ని చిట్కాలు పాటించి దాని నుండి ఉపశమనం పొందవచ్చు. 
 
ఒక గ్లాసు మజ్జిగలో మూడు టీస్పూన్ల సున్నపు తేట కలుపుకుని ఉదయం పూట మూడు రోజులు త్రాగితే నడుము నొప్పి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణుల సూచన. ఇంకా ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుందని మనకు తెలుసు, శరీరంలో రక్తాన్ని ఉత్పత్తి చేయడానికి బాగా దోహదపడుతుంది. ఖర్జూరంతో నడుము నొప్పిని కూడా దూరం చేసుకోవచ్చు. 
 
ఖర్జూర పండ్లు తిని వేడి నీరు త్రాగితే నొప్పి మటాష్ అవుతుంది. మేడికొమ్మపాలు పట్టువేస్తే నడుము నొప్పి ఉండదు. రసకర్పూరం, నల్లమందు కొబ్బరి నూనెలో కలిపి నొప్పి ఉన్న చోట పట్టిస్తే ఉపశమనం కలుగుతుంది. అలాగే శొంఠి, గంధం తీసి నడుముపై పట్ట వేసి తెల్లజిల్లేడు ఆకులు కట్టినట్లైతే నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.