మహిళలు వారానికి 2 రోజులు చేపలు తీసుకుంటే...
మహిళలు వారానికి రెండుసార్లు చేపలను ఆహారం తీసుకోవడం ద్వారా అడినోమాకు చెక్ పెట్టవచ్చునని కొత్త అధ్యయనంలో తేలింది. వారానికి రెండుసార్లు కాకపోయినా ప్రతి రెండువారాలకు ఒకసారి చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా మహిళలకు అడినోమా వ్యాధి సోకకుండా ఉంటుంది.
అడినోమా అనేది పుట్టగొడుగు పరిణామంలో మహిళల్లో కొలొరెక్టల్ కేన్సర్‌కు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ కేన్సర్‌కు చెక్ పెట్టాలంటే చేపలను వారంలో ఒక్కసారైనా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంకావారంలో ఒక్కసారి ఆహారంలో చేపను తప్పకుండా చేర్చుకోవడం ద్వారా పలు రోగాలను నయం చేయవచ్చునని వారు అంటున్నారు.