మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 11 జులై 2019 (20:55 IST)

ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది... ఇలా చేస్తే సరి....

ఇటీవలకాలంలో చిన్నా పెద్ద వయసుతో సంబందం లేకుండా వేదిస్తున్న సమస్య జుట్టు చిట్లిపోవడం, రాలిపోవడం. ఈ సమస్యలకు అనేక రకములైన షాంపూలు, మందులు ఉన్నప్పటికి అవి తాత్కాలికంగా మాత్రమే పని చేస్తాయి. ఈ మందులు, షాంపూలు సరిపడకపోతే ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది. అలాకాకుండా సహజసిద్దంగా లభించే పదార్దాలతో మన జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అవేంటో చూద్దాం.
 
1. ఎండ మరియు ఇతర కారణాల వల్ల జుట్టు చిట్లినప్పుడు మరియు ఊడిపోతున్నప్పుడు రెండు కప్పుల తాజా నిమ్మ రసంలో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించాలి. ఇరవై నిమిషముల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికో సారి చేస్తుంటే సమస్య దూరమవుతుంది.
 
2. అరకప్పు తేనెను శుభ్రమైన తడి జుట్టుకి రాసుకుని ఇరవై నిముషములు ఆరనివ్వాలి. తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన అతినీలలోహిత కిరణాల నుండి జుట్టును కాపాడుకోవచ్చు.
 
3. జుట్టు నిర్జీవంగా కనిపిస్తున్నప్పుడు అరకప్పు పుల్లటి పెరుగు, చెంచా తేనె కలిపి జుట్టుకి పట్టించాలి. ఇరవై నిమిషముల తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుని చన్నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే జుట్టు నిగనిగలాడుతుంది. ఆరోగ్యంగా ఎదుగుతుంది.
 
4. కలబంద రసానికి, చెంచా తేనె, చెంచా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టుకి, మాడుకి కావలసిన తేమ అందుతుంది.