శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 19 జూన్ 2018 (20:48 IST)

పొదుపు చేయడం చాలా ముఖ్యం... లేదా కాసుల కోసం కష్టాల...

పొదుపు చాలా అవసరం. ఒక లక్ష్యం పెట్టుకుని దానికి తగినట్లుగా పొదుపు చేసుకుంటూ పోతే ఏ సమస్యా ఉండదు. ఇల్లూ, కారు, పిల్లల చదువు ఏదైనా కావచ్చును. కొన్ని కాలపరిమితులు పెట్టుకుని పొదుపు చేసుకుంటూ పోవాలి. అప్ప

పొదుపు చాలా అవసరం. ఒక లక్ష్యం పెట్టుకుని దానికి తగినట్లుగా పొదుపు చేసుకుంటూ పోతే ఏ సమస్యా ఉండదు. ఇల్లూ, కారు, పిల్లల చదువు ఏదైనా కావచ్చును. కొన్ని కాలపరిమితులు పెట్టుకుని పొదుపు చేసుకుంటూ పోవాలి. అప్పుడే లక్ష్యాలతో పాటు సరదాలు, సంతోషాలు కూడా కలిసివస్తాయి.
 
కాబట్టి దానికి తగినట్లుగా కూడా కొంత మెుత్తాన్ని విడిగా పెట్టుకోవాలి. ఎలాగంటే దేశ, విదేశ వస్తువులు కొనుక్కోవలసి వచ్చినప్పుడు ముందుగానే బ్యాంకుల్లో డబ్బులను పొదుపు చేసుకుంటే మంచిది. బ్యాంకులు ఇందుకు అనుగుణంగా తాత్కాలిక లక్ష్యాల కోసం కూడా పొదుపు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. 
 
అత్యవసర సమయాల్లో ఆదుకునేందుకు పొదుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. అనుకోని ప్రమాదాలు ఇతరత్రా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలైనప్పుడు మూడు లేదా ఆరు నెలల జీతాన్ని అత్యవసర నిధి క్రింద సిద్ధంగా పెట్టుకోవాలి. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవీ విరమణ వరకు జీవితం సజావుగా సాగేందుకు విడిగా కొంత మొత్తాన్ని దాచుకోవాలి. లేదంటే వృద్ధాప్యంలో కూడా కాసుల కోసం కష్టాలు పడవలసి వస్తుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.