మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Kowsalya
Last Updated : శనివారం, 2 జూన్ 2018 (13:07 IST)

ఆడపిల్లలు గాజులు ఎందుకు వేసుకోవాలంటే?

ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపాలు. కాబట్టి చేతినిండా గాజులువేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని అర్థం. పెద్దలు ఆడపిల్లలకు గాజులువేసి చూడడంలో చాలా సంతోషపడుతారు. గాజుల సవ్వడితో చేతులు గలగలా అంటూ శబ్ధం చే

ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపాలు. కాబట్టి చేతినిండా గాజులువేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని అర్థం. పెద్దలు ఆడపిల్లలకు గాజులువేసి చూడడంలో చాలా సంతోషపడుతారు. గాజుల సవ్వడితో చేతులు గలగలా అంటూ శబ్ధం చేస్తే అమ్మాయి అందం రెట్టింపవుతుంది. అయితే వీటిని వేసుకోవడం వలన అందమే కాదు వాళ్లకు ఎలాంటి కీడు జరగకుండా గాజులే రక్షగా ఉంటాయి.
 
గాజులు వేసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయని హిందూ సంప్రదాయం చెబుతోంది. పుట్టిన పిల్లలకు నల్లగాజులు వేయడం వల్ల దోషాలు, దిష్టి తగలకుండా ఉంటాయి. గాజులను పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుకుంటారని నమ్మకం.
 
రంగురంగుల గాజులు మగువలను ఆకట్టుకుంటాయి. మరి ఏ రంగు గాజులు వేసుకుంటే మంచిదో చూద్దాం. ఎరుపు రంగు గాజులు శక్తిని, నీలిరంగు గాజులు విజ్ఞానాన్ని, ఊదారంగు రంగు గాజులు స్వేచ్ఛను, ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని, పసుపు రంగు గాజులు సంతోషాన్ని, నారింజ రంగు గాజులు విజయాన్ని, తెలుపు రంగు గాజులు ప్రశాంతతను, నలుపు రంగు గాజులు అధికారాన్ని, వెండి గాజులు బలాన్ని, బంగాలు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి.
 
హిందూ సంప్రదాయం ప్రకారం గాజులు అతివల సౌభాగ్యానికి చిహ్నం. బంగారు గాజులు ఎన్ని వేసుకున్న, కనీసం రెండు మట్టిగాజులను ధరించాలి. అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతోపాటు గాజులతో పూజిస్తే మంచిది. గాజులు పగలడాన్ని అమంగళం, అశుభంగా భావిస్తారు భారతీయులు.