మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అన్నివిధాల అనుకూలమే. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు, ముఖ్యుల కలయిక వీలుపడదు. దూరప్రయాణం తలపెడతారు.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం, దుబారా ఖర్చులు విపరీతం, పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆప్తులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
మిథునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో సతమతమవుతారు. శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనులు ముందుకు సాగవు. ఓర్పుతో యత్నాలు సాగించండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. ఎదుటివారి అంతర్యం గ్రహించండి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, పనులు మందకొడిగా సాగుతాయి. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలను అధిగమిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవచ్చు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. వేడుకకు హాజరవుతారు. కొత్తపరిచయాలేర్పడతాయి.
కన్య, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మాటతీరుతో ఆకట్టుకుంటారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. కీలక విషయాలు వెల్లడించవద్దు. దైవదర్శనాలు ఉల్లాసాన్నిస్తాయి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఖర్చులు సామాన్యం. సన్నిహితులకు సాయం చేస్తారు. పెద్దలతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త, అనవసర జోక్యం తగదు. కీలక పత్రాలు అందుకుంటారు. ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు
మీ విజ్ఞతకు గౌరవం లభిస్తుంది. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఉభయులకూ చక్కని సలహాలిస్తారు. వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు విపరీతం. కొత్త పరిచయాలేర్పడతాయి. పనులు అప్పగించవద్దు. నగదు, పత్రాలు జాగ్రత్త
ధనస్సు: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగువేయాలి. నమ్మకస్తులే మోసగిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఖర్చులు విపరీతం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆప్తుల రాక ఉత్సాహాన్నిస్తుంది. పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. విదేశాల సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలతో తీరిక ఉండదు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. తొందరపాటు నిర్ణయాలు తగవు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. వస్త్రప్రాప్తి. వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అధికం. పత్రాలు జాగ్రత్త. పనులు హడావుడిగా సాగుతాయి.