బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వార్షిక ఫలం
Written By రామన్
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (14:27 IST)

2022 మేషరాశి వారి రాశి ఫలితాలు ఎలా వున్నాయి?

మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఆదాయం: 14 వ్యయం: 14 రాజ్యపూజ్యం: 3 అవమానం: 6
 
ఈ రాశివారి గోచారం పరిశీలించగా ఈ సంవత్సరమంతా అనుకూలంగానే ఉంటుందని చెపవచ్చు. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ధనలాభం ఉంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గత సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తుతాయి. 

 
బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పదవులు, సభ్యత్వాల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. వివాహయత్నం ఫలిస్తుంది, అయితే జాతక పొంతన ముఖ్యమని గమనించండి. ఉద్యోగస్తులకు శుభసూచకం. ప్రమోషన్లతో కూడిన బదిలీలుంటాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. స్టాకిస్టులు హోల్ సేల్ వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 

 
విద్యార్థులు అనవసర వ్యాపకాలను తగ్గించుకుంటే కాని లక్ష్యం నెరవేరదు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యాలపై దృష్టి పెడతారు. తరచు ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆస్తి, కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. ఆస్తి, ఇతర వివాదాలు పరిష్కార దదిశగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మార్గంలో పయనిస్తుంది.