నడుము నొప్పి తగ్గడానికి ఆయుర్వేద వైద్యం
వయస్సు మీదపడో లేక ఎక్కువగా పనిచేసో చాలా మందికి నడుము నొప్పి వస్తుంది. విరామం లేకుండా కుర్చీలో కూర్చుని పనిచేసే వారికి ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది. దీనికి శాస్త్రీయ కారణం ఏమైనప్పటికీ వీటిని పాటించడం ద్వారా నొప్పిని దూరం చేసుకోవచ్చు. గ్లాసు మజ్జిగలో మూడు టీస్పూన్‌లు సున్నపు తేట కలుపుకుని త్రాగితే ఉపశమనం ఉంటుందని ఆయుర్వేద నిపుణుల సూచన.
ఖర్జూర పండ్లు తిని వేడినీళ్లు త్రాగితే చాలా ప్రయోజనం ఉంటుంది. మేడికొమ్మపాలు పట్టువేస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది, నడుము నొప్పి ఇట్టే మాయమైపోతుంది. అలాగే కొబ్బరినూనెలో రసకర్పూరం, నల్లమందు కలిపి నొప్పి ఉన్న చోట రాస్తే నొప్పి తగ్గుతుంది. శొంఠి, గంధం తీసి నడుముపై పట్టువేసి తెల్లజిల్లేడు ఆకులు కప్పితే ఎలాంటి నొప్పైనా దూరం అవుతుంది.