శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : మంగళవారం, 24 అక్టోబరు 2017 (11:21 IST)

కంటి అలసట తొలగిపోవాలంటే?

కంటి అలసట తొలగిపోవాలంటే... కీరను చక్రాల్లా కోసి కళ్లపై ఉంచుకుని పదినిమిషాల తరువాత తీసేయాలి. కళ్ల అలసట పోతుంది. కంటి మంట తగ్గిపోతుంది. అదేపనిగా కంప్యూటరుతో పనిచేసేవాళ్లు కళ్లకు సంబంధించిన వ్యాయామాల్ని

కంటి అలసట తొలగిపోవాలంటే... కీరను చక్రాల్లా కోసి కళ్లపై ఉంచుకుని పదినిమిషాల తరువాత తీసేయాలి. కళ్ల అలసట పోతుంది. కంటి మంట తగ్గిపోతుంది. అదేపనిగా కంప్యూటరుతో పనిచేసేవాళ్లు కళ్లకు సంబంధించిన వ్యాయామాల్ని కచ్చితంగా చేయాలి. ముందు కళ్లను గుండ్రంగా తిప్పాలి. తరవాత కుడి, ఎడమలవైపు తిప్పాలి. ఇలా రోజులో కుదిరినప్పుడల్లా చేస్తే అలసట దూరమవుతుంది. కళ్లూ ఆరోగ్యంగా ఉంటాయి.
 
అలాగే కీరదోస రసంలో కాస్త గులాబీనీరు కలిపి అందులో దూది ఉండల్ని ముంచి కళ్లపై పెట్టుకోవాలి. అవి ఆరిపోయాక తీసేస్తే అలసట పోవడమే కాదు.. కళ్లూ ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కళ్ల అలసటను దూరం చేసి, సాంత్వన అందించడంలో తేనె, పాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. 
 
రెండు చెంచాల తేనెలో కాసిని పాలు కలిపి కళ్ల చుట్టూ నెమ్మదిగా దూదితో రాసుకోవాలి. ఇది బాగా ఆరాక చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే ఫలితం ఉంటుంది. కళ్ల మంట కూడా తగ్గుతుంది. ఒక బంగాళాదుంపను తురిమి దాన్ని కళ్లపై పెట్టుకోవాలి. బాగా ఆరాక కడిగేస్తే చాలు. అలసట పోవడమే కాదు, నల్లనివలయాలూ తొలగిపోతాయని బ్యూటీషియన్లు అంటున్నారు.