మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : గురువారం, 5 జులై 2018 (15:26 IST)

మిల మిల మెరిసే మీ చేతుల కోసం.... ఈ చిట్కాలు...

స్త్రీల సౌందర్య పోషణలో చేతులు ప్రముఖపాత్ర పోషిస్తాయి. చాలా మంది వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు.

స్త్రీల సౌందర్య పోషణలో చేతులు ప్రముఖపాత్ర పోషిస్తాయి. చాలామంది వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు.
 
చేతికి ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ క్రీములు రాస్తూ ఉండాలి. నిమ్మరసంలో పంచదారను కలుపుకుని చేతులకు మర్దనా చేసుకుంటే చేతులు నునుపుగా ఉంటాయి. పండ్లు ఎక్కువగా తీసుకుంచే చేతులు నిగనిగలాడుతాయి. గ్లిజరిన్‌లో ఆలివ్ ఆయిల్ కలుపుకుని ఆ మిశ్రమాన్ని చేతులకు రాసుకుంటే చేతులు కాంతివంతంగా తయారవుతాయి.
 
స్పూన్ పంచదారలో కాస్త కొబ్బరినూనెను కలిలి చేతులుకు మర్దనా చేసుకోవడం వలన చేతులు నునుపుగా తయారవుతాయి. బట్టలు ఉతికుతున్నప్పుడు  బట్టల సబ్బులో ఉండే రసాయన పదార్థాలు మీ చేతులకు హాని కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి ఉతికిన వెంటన్ నిమ్మరసాన్నిచేతికి రాసుకుని కాసేపాగాక కడుక్కుంటే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
అతివేడయిన, అతిచల్లనైన పదార్థాలను డైరక్ట్‌గా చేతులతో తాకకూడదు. స్పూన్ రోజ్‌వాటర్‌లో కాస్త గ్లిజరిన్ కలుపుకుని చేతులకు రాసుకుని గంట తరువాత శుభ్రంగా కడుక్కుంటే మీ చేతులు మృదువుగా తయారవుతాయి.