శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By మోహన్
Last Modified: శనివారం, 23 మే 2020 (16:17 IST)

కళ్ల క్రింద నల్లటి వలయాలు తగ్గాలంటే ఏమి చేయాలి..

చాలామందికి కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. వీటిని తగ్గించుకోవడానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల క్రీములను వాడుతుంటారు. అలా కాకుండా ఇంట్లో లభించే వస్తువులతోనే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
 
* గులాబీరేకుల పొడిలో అలోవెరా జెల్‌ను కలిపి రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
* బొప్పాయి, పుదీనా పౌడర్‌లను చందనం నూనెతో కలిపి నల్లటి చర్మంపై అప్లై చేయాలి.
* ఛాయపసుపులో దోసకాయరసం కలిపి రాసినా మంచి ఫలితం ఉంటుంది.
* కాఫీపౌడర్‌ని కొబ్బరినూనెతో కలిపి రాస్తే నలుపు తగ్గుతుంది.
* కంటివలయాలు దరిచేరకుండా ఉండాలంటే సరైన నిద్ర అవసరం.