గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : సోమవారం, 14 జనవరి 2019 (13:07 IST)

స్ట్రాబెర్రీలతో ప్యాక్ ఎలా వేసుకోవాలి..?

ఎర్రని స్ట్రాబెర్రీ పండ్లతో ప్యాక్ వేసుకుంటే నిగనిగలాడే కురులను సొంతం చేసుకోవచ్చునని బ్యూటీషన్లు చెప్తున్నారు. స్ట్రాబెర్రీలు ఆరోగ్యానికే కాకుండా శిరోజాలకు ఎంతో మేలు చేస్తాయి. వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తారు. ఇంకా స్ట్రాబెర్రీలతో వారానికోసారి లేదా నెలకు రెండు సార్లు ప్యాక్ వేసుకుంటే మెరిసే శిరోజాలను పొందవచ్చు. మరి స్ట్రాబెర్రీలతో ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం... 
 
ప్యాక్ ఎలా వేసుకోవాలంటే?
ఒక కప్పు స్ట్రాబెర్రీలను జ్యూస్‌చేసి గుడ్డు పచ్చ సొన, రెండు చెంచాల ఆలివ్ ఆయిల్‌లను ఓ బౌల్‌లో వేసి బాగా మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని అరగంట పాటు అలానే ఉంచుకోవాలి. అరగంటయ్యాక కెమికల్స్ లేని షాంపుతో హెయిర్ వాష్ చేసుకుంటే.. చక్కని ఫలితం లభిస్తుంది. 
 
అలానే జిడ్డు చర్మంతో పాటు మాడుకున్న ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే.. ఓట్మీల్, పాలు, బాదం నూనెలను కలిపి పేస్టులో తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కేశాలకు పూతగా ప్యాక్‌ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తే ఆరోగ్యవంతమైన కేశాలను పొందవచ్చు.