సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (12:56 IST)

అక్షయ తృతీయ: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

gold
బంగారం కొనాలనుకుంటున్న వారికి శుభవార్త. బంగారం, వెండి ధరలు మరోసారి దిగొచ్చాయి. మరో నాలుగు రోజుల్లో అక్షయ తృతీయ ఉండటంతో.. తగ్గుతోన్న ధరలు దేశీయంగా మహిళలకు శుభవార్తగా నిలుస్తున్నాయి. 
 
శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ.48 వేలకు చేరింది. 
 
అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గుదలతో రూ.52,370కు దిగొచ్చింది. బంగారంతో పాటు వెండి ధరలు భారీగా పడిపోయాయి. 
 
కేజీ వెండిపై వెయ్యి రూపాయల మేర ధర తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.69 వేలకు పడిపోయింది.