భారతదేశంలోని ఐఐటీ హైదరాబాద్ వద్ద స్మార్ట్ ఫుడ్ కోర్ట్‌ను ప్రారంభించిన ఇస్తారా
భారతదేశపు ప్రీమియం స్మార్ట్‌ఫుడ్ కోర్ట్‌లో అగ్రగామి, కో-లివింగ్ బ్రాండ్ ఇస్తారా తమ స్మార్ట్ ఫుడ్ కోర్ట్ ఉనికిని దేశంలో మరింతగా విస్తరిస్తూ తమ 40వ స్మార్ట్ ఫుడ్ కోర్ట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. తద్వారా తమ స్మార్ట్ ఫుడ్ కోర్ట్స్ సీట్ల సంఖ్యను దేశంలో 10000కు చేర్చింది. ఈ నూతన స్మార్ట్ ఫుడ్ కోర్ట్‌ను ఐఐటీ హైదరాబాద్‌లోని టెక్నాలజీ రీసెర్చ్ పార్క్ వద్ద ఏర్పాటుచేశారు. దీనిని భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ) సెక్రటరీ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ ప్రారంభించారు.
విద్యాసంస్థలు, కార్యక్షేత్రాల వద్ద కేఫటేరియాలలో సాంకేతిక ఆధారిత ప్రక్రియలను తీసుకురావడంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఇస్తారా సంప్రదాయ సంస్ధాగత ఫుడ్ కోర్ట్‌లను పునరావిష్కరిస్తుంది. ఈ వినూత్నమైన స్మార్ట్ ఫుడ్ కోర్టుల ద్వారా ఇస్తారా ఇప్పుడు ఫుడ్ టెక్ భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తూనే వెండార్ యాగ్రిగేటర్‌గా విద్యాసంస్ధలు మరియు కార్పోరేట్స్‌కు సహాయపడుతూ ఫుడ్ కోర్టులు మరింత సమర్థవంతంగాడిజిటైజ్ చేయడంలో సహాయపడుతుంది.
2017లో ప్రారంభమైన ఇస్తారా, కో-లివింగ్ విభాగాన్ని విప్లవాత్మీకరించడంతో పాటుగా 24వేలకు పైగా బెడ్స్‌ను హైదరాబాద్, బెంగళూరు, ఎన్‌సీఆర్, చెన్నైలలో నిర్వహిస్తుంది. 2020లో ఈ కంపెనీ స్మార్ట్‌ఫుడ్ కోర్ట్ వ్యాపారాలను ప్రారంభించడంతో పాటుగా 50కు పైగా ఫుడ్ కోర్ట్‌లను తెలంగాణా, కర్నాటక, తమిళనాడులలో నిర్వహిస్తూ 2లక్షల మందికి పైగా ప్రజలకు సేవలనందిస్తుంది.
తమ వ్యాపారాలలో సాంకేతికతను అత్యంత కీలకంగా వాడుతున్న ఇస్తారా, తమ స్మార్ట్ ఫుడ్ కోర్ట్‌లను మల్టీ క్యుసిన్, మల్టీ వెండార్ యాగ్రిగేటర్ ఫార్మాట్‌లో నిర్వహిస్తూ ప్రజలకు విభిన్నమైన ఆహార అవకాశాలను అందిస్తుంది. మహమ్మారి కాలంలో ఇస్తారా ఫుడ్ కోర్ట్స్ అధికంగా ఫుడ్ టెక్‌పై ఆధారపడటంతో పాటుగా ఫుడ్ సేఫ్టీ, నాణ్యత, సేవలు, అర్బన్ మిల్లీనియల్ ఎంపికలు పరంగా నూతన ప్రమాణాలను రూపొందించింది. తద్వారా కేఫటేరియా అనుభవాలను సైతం పునర్నిర్వచించింది. రాబోయే మూడు సంవత్సరాలలో ఇస్తారా తమ సీట్ల సంఖ్యను 1,50,000కు విస్తరించడం ద్వారా రెండు మిలియన్ల మంది అవసరాలను తీర్చడం లక్ష్యంగా చేసుకుంది.
ఈ విస్తరణ గురించి ఇస్తారా కోఫౌండర్ గిల్బర్ట్ జేమ్స్ మాట్లాడుతూ, దేశంలో మా ఉనికిని విస్తరించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ప్రపంచ శ్రేణి డిజిటల్-నిర్వచిత కేఫటేరియా అనుభవాలను తీసుకురావాలనే మా ప్రయత్నానికి ఇది నిదర్శనంగా నిలువడంతో పాటుగా మారుతున్న మిల్లీనియల్ అవసరాలను సైతం తీర్చనుంది. ఎన్నో సంవత్సరాలుగా విద్యా సంస్థలు, వర్క్‌ప్లేస్‌లు తమ కేఫటేరియాలను పరిమిత ఆహార అవకాశాలతో, అతి తక్కువ పరిశుభ్రతతో, సేవలపై ఎలాంటి దృష్టి పెట్టకుండా నిర్వహిస్తున్నాయి.
మహమ్మారి తరువాత ఈ అంతరం మరింత స్పష్టంగా భద్రత , పరిశుభ్రత కోణంలో కనిపించింది. అసాధారణ ఆహార అనుభవాలను అందించడంపై దృష్టి సారించిన ఇస్తారా ఫుడ్ కోర్ట్స్ ఇప్పుడు ఈ అంతరాన్ని పూరించే రీతిలో ఉండటంతో పాటుగా ఆహారానికి సంబంధించి మిల్లీనియల్స్ యొక్క ప్రాధమిక సమస్యను తీరుస్తుంది. మహమ్మారి అనంతర ప్రపంచంలో భద్రత, పరిశుభ్రత అనేవి అత్యంత కీలకమైన అంశాలుగా మారిన వేళ ఈ వైవిధ్యమైన వేదిక కేవలం సంస్ధాగత కేఫటేరియా విభాగాన్ని మాత్రమే విప్లవాత్మీకరించడంతో పాటుగా దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఫుడ్‌టెక్ రంగంలో సైతం ఆవిష్కరణలను తీసుకురానుంది అని అన్నారు.