శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మే 2022 (11:05 IST)

35 పోస్టల్ సర్కిళ్లలో 38,926 పోస్టుల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి కసరత్తు మొదలుపెట్టింది.
 
గతంలో వేర్వేరు రాష్ట్రాల్లో ఖాళీల భర్తీకి వేర్వేరు జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేసిన ఇండియా పోస్ట్, ఈసారి 35 సర్కిళ్లలో 38,926 పోస్టుల భర్తీకి ఒకేసారి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం. 
 
తెలంగాణలో 1226, ఆంధ్రప్రదేశ్‌లో 1716 పోస్టులున్నాయి. మొత్తం కలిపి తెలుగు రాష్ట్రాల్లో 2,942 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2022 జూన్ 5 లోగా అప్లై చేయాల్సి వుంటుంది.