శనివారం, 10 జనవరి 2026
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2015 (18:22 IST)

పిల్లలు ఇష్టంగా తినాలంటే ఏం చేయాలో తెలుసుకోండి

పిల్లలు కడుపు నిండా తినాలని ఆరాటపడుతుంటారు. ఆకలి మందగించిందా లేదా అని గమనించి, అందుకు తగ్గట్లు ఆహార అలవాట్లను మార్చాలి. ఇంకా పిల్లలు ఇష్టపడి తినాలంటే.. ఆకలి పెంచే క్రమంలో ఉదయాన్నే తీసుకునే అల్పాహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. ముఖ్యంగా తృణధాన్యాలూ, పెరుగూ, పండ్ల వంటి వాటిలో చేసిన వివిధ పదార్థాలను ఎంచుకుని వారికి అందించాలి. ఇవి శరీరానికి తగిన పోషకాలను అందిస్తూనే ఆకలిని పెంచుతాయి. 
 
చిన్నారులకు ఆహారాన్ని అందించే వేళల్ని క్రమబద్ధం చేసుకోండి. మీ పని పూర్తవడాన్ని బట్టో లేక ఓ పనైపోతోందనో భావించి చేయొద్దు. ఇలాంటప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టేయడం వల్ల వారికి అన్నం తినడం మీద ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంది. జీర్ణశక్తి మందగిస్తుంది. అందుకే కొద్ది కొద్దిగా అన్నం తినేలా చూడండి. 
 
చిరుతిండిని పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. అవే తినాలని నిబంధన పెట్టకూడదు. వారి ఇష్టానికి అనుగుణంగా ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్స్ ఇవ్వండి. అవసరమైనప్పుడు పండ్లు, నట్స్, క్రీమ్ చీజ్, పాప్ కార్న్ వంటివి ఎదిగే పిల్లలకు అవసరమని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.