శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 14 డిశెంబరు 2022 (23:25 IST)

మెత్తని ఇడ్లీలను చేయడం ఎలాగో తెలుసా?

idli
ఇడ్లీలు మెత్తగా, రుచిగా వుంటే తినడానికి బాగుంటాయి. కొన్నిసార్లు ఇడ్లీలు రాళ్లలా గట్టిగా వుంటుంటాయి. దీనికి కారణం తగుపాళ్లలో పిండిని కలపకపోవడమే. దూదిపింజల్లా మెత్తని ఇడ్లీ ఎలా చేయాలో తెలుసుకుందాము.
 
కప్పు మినపప్పు, రెండున్నర కప్పుల ఇడ్లీ రవ్వ, తగినంత ఉప్పు, కావలసినన్ని నీళ్లు.
 
మినపప్పును కడిగి 5 గంటలపాటు, ఇడ్లీ రవ్వను గంటపాటు నానబెట్టుకోవాలి.
 
మినపప్పును మిక్సీపట్టి గిన్నెలోకి తీసుకోవాలి, మిక్సీ వేసేటపుడు చన్నీటిని వాడాలి.

ఇడ్లీ రవ్వలో వున్న నీళ్లన్నీ పిండుతూ గిన్నెలో వున్న మినప పిండిలో వేసి కలుపుకోవాలి.
 
ఈ కలిపిన పిండిని కనీసం 7 నుంచి 8 గంటల పాటు పులియబెట్టాలి. 
 
ఆ తర్వాత ఆ పిండిలో తగినంత ఉప్పు, నీళ్లు పోసి మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా కలుపుకోవాలి.
 
ఇక ఆ పిండిని ఇడ్లీ పాత్రలో వేసి మూతపెట్టి మధ్యస్థంగా మంటపెట్టి 10 నిమిషాలు పాటు ఉడికించుకోవాలి.
 
పాత్రను దింపి చూడండి, మెత్తగా దూది పింజల్లా వుండే ఇడ్లీలు రెడీ.