మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 ఆగస్టు 2021 (18:34 IST)

ఏపీలో కొత్తగా మరో 2050 పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఓ బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ మేరకు గడచిన 24 గంటల్లో 85,283 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,050 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. 
 
అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 375 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 324, నెల్లూరు జిల్లాలో 221, ప్రకాశం జిల్లాలో 212, గుంటూరు జిల్లాలో 209 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 23 కొత్త 
కేసులు నమోదయ్యాయి.
 
అదేసమయంలో 2,458 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 13,531 మంది కరోనాతో కన్నుమూశారు. ఏపీలో ఇప్పటిదాకా 19,82,308 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,48,828 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,949 మంది చికిత్స పొందుతున్నారు.