మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : శనివారం, 8 ఆగస్టు 2020 (20:41 IST)

సినీ నటి నవనీత్‌ కౌర్‌కు కరోనా

కరోనా వరుసగా ప్రముఖులను చుట్టేస్తోంది. తాజాగా తెలుగులో 'శీను వాసంతి లక్ష్మీ', 'శతృవు', 'జగపతి', 'రూమ్‌మేట్స్‌', 'యమదొంగ', 'బంగారు కొండ' తదితర చిత్రాల్లో నటించిన హీరోయిన్, మహారాష్ట్రలోని అమరావతి ఎంపి నవనీత్‌ కౌర్‌కు కరోనా పాజిటివ్‌గ నిర్ధారణ అయింది.

''నా కుమార్తె, కుమారుడితో పాటు ఇతర కుటుంబ సభ్యులకూ వైరస్‌ సోకింది. ఓ తల్లిగా వారిని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. ఈ క్రమంలో నాకూ వైరస్‌ సోకింది'' అని ఆమె ఫేస్‌బుక్‌లో వెల్లడించారు.

అభిమానుల ఆశీస్సులతో తామంతా కరోనాను జయిస్తామని నవనీత్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ ప్రభుత్వం సూచించే మార్గదర్శకాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.