మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (17:47 IST)

కరోనా వైరస్ భయం... మక్కాలో ముస్లిం తీర్థయాత్రలు నిషేధం (వీడియో)

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ ప్రభావం అంతటా ఉంది. ఇప్పటికే అనేక దేశాలను ఈ వైరస్ వణికిస్తోంది. దీంతో ఉత్సవాలు, ఆధ్యాత్మిక తీర్థయాత్రలు కూడా రద్దు చేసుకుంటున్నారు. తాజాగా మక్కాలో ముస్లిం తీర్థయాత్రలపై నిషేధం విధించారు. 
 
నిజానికి రంజాన్ ఉపవాస, వార్షిక హజ్ తీర్థయాత్రకు ముందే వేలాది ముంది ముస్లింలు మక్కాకు చేరుకోవడం ఆనవాయితీ. అయితే, కరోనా వైరస్ భయం కారణంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశంలోని అనేక పవిత్ర స్థలాలను మూసివేసింది. అలాగే మక్కాలో ముస్లిం హజ్ యాత్రను కూడా నిషేధించింది. నిర్ణయం అనేక మంది ముస్లిం ప్రజలపై పడనుంది.
 
ఈ విషయాన్ని సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ వర్గాలను ఉటంకిస్తూ ప్రభుత్వ సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ నిషేధం ఎంతకాలం పాటు అమల్లో ఉంటుందో తెలియదు. కరోనా వైరస్ బాధిత దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఉన్న విషయం తెల్సిందే.