శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

దేశంలో ఉధృతంగా కరోనా పాజిటివ్ కేసులు - కొత్తగా 2.64 లక్షల కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుకుంది. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కోవిడ్ కేసుల పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,64,202 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఎనిమిది నెలల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఇకపోతే, దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 5,753కి పెరిగిపోయింది. నిన్నటితో పోల్చితే ఈ కేసుల పెరుగుదలలో 4.83 శాతం పెరుగుదల కనిపించింది. దేశంలో నమోదైన తాజా కేసులతో కలుపుకుంటే 12,72,073కు చేరింది. ఈ కేసుల ఇంకా క్రియాశీలంగా ఉండగా, రోజువారీ పాజిటివ్ రేటు 14.78 శాతంగా ఉంది. 
 
దేశంలో కరోనా వైరస్ మళ్ళీ ప్రతాపం చూపిస్తుండటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి రోజున ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్‌లోని గంగానదిలో భక్తుల పుణ్యస్నానాలపై నిషేధం విధించింది.