ఆసియా క్రీడలకు ద్వితీయ శ్రేణి జట్టు.. బీసీసీఐ యూటర్న్
ఏషియన్ గేమ్స్ 2023లో భారత మహిళల క్రికెట్ జట్టుతో పాటు పురుషుల క్రికెట్ జట్టు కూడా బరిలోకి దిగనుంది. 2010, 2014 ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను భాగం చేసినా.. టీమిండియా ఇప్పటి వరకు పాల్గొనలేదు.
బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, శ్రీలంక క్రికెట్ జట్లు పాల్గొన్నా.. బీసీసీఐ మాత్రం తమ జట్లను పంపించలేదు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆసియా క్రీడలకు ద్వితీయ శ్రేణి జట్టును పంపించాలని భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
మహిళల జట్టు కూడా ఈ టోర్నీలో పాల్గొననుంది. జూన్ 30లోపు భారత ఒలింపిక్ అసోసియేషన్‌కు బీసీసీఐ తమ ఆటగాళ్ల జాబితాను పంపనున్నట్లు తెలుస్తోంది.