సోమవారం, 1 డిశెంబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 నవంబరు 2025 (16:57 IST)

రాంచీ వన్డే మ్యాచ్ : 52వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ

virat kohli
భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ చేసింది. స్వదేశంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ రాంచీ వేదికగా ఆదివారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ తన 52వ సెంచరీ చేశారు. మొత్తం 120 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 7 సిక్సర్లు, 11 ఫోర్స సాయంతో 135 పరుగుుల చేశాడు. 
 
స్థానిక జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ సారథ్యంలోని టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. టెస్ట్ సిరీస్ సాధించిన విజయాన్ని వన్డేల్లోనూ కొనసాగించాలని సఫారీ జట్టు పట్టుదలతో ఉండగా, ఈ సిరీస్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్లో విమర్శలకు చెక్ పెట్టాలని భారత్ భావిస్తోంది.
 
ఈ మ్యాచ్‍కు పలువురు కీలక భారత ఆటగాళ్లు దూరమయ్యారు. కోల్‌కతా టెస్టులో మెడకు గాయమైన గిల్ అందుబాటులో లేకపోవడంతో, అతని స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులో లేకపోవడంతో యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌ను తుది జట్టులో చోటు దక్కింది. సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డే జట్టులోకి తిరిగి రావడంతో అందరి దృష్టి వారి ప్రదర్శనపైనే ఉంది.
 
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ.
 
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, ఐడెన్ మార్ క్రమ్ (కెప్టెన్), మాథ్యూ బ్రీట్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, ప్రెనెలన్ సుబ్రాయెన్, నాండ్రే బర్గర్, ఒట్నీల్ బార్ట్‌మేన్.