శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (12:23 IST)

కోహ్లీకి తప్పని జరిమానా.. రోహిత్, రహానే, ధోనీకి తర్వాత విరాటే,..?

స్లో ఓవర్ రేట్ కారణంగా ఆర్సీబీ జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లీపై ఐపీఎల్ మేనేజ్‌మెంట్ జరిమానాను విధించింది. శుక్రవారం జరిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లీకి జరిమానా విధించినట్లు ఐపీఎల్ వెల్లడించింది.


ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, నియమిత సమయంలో ఓవర్లను పూర్తి చేయకపోవడం నేరమన్న సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ మ్యాచ్ ఫీజులో కొంత జరిమానాగా చెల్లించక తప్పలేదు.
 
ఈ సీజన్‌లో ఇప్పటికే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా చెల్లించిన సంగతి తెలిసిందే. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్ లోనే రోహిత్ జరిమానా కట్టాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ అజింక్య రహానే కూడా ఇదే తరహా శిక్షకు గురయ్యాడు.
 
అలాగే టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి జరిమానా పడింది. గురువారం రాత్రి రాజస్థాన్‌  రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్లతో వాదనకు దిగిన కారణంగా ధోనీ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించారు. దీంతో మిస్టర్‌ కూల్‌కు చేదు అనుభవం ఎదురైంది.