విదేశీ లీగ్‌లో మెంటరుగా ఎంఎస్.ధోనీ?
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విదేశీ లీగ్ జట్టుకు మెంటరుగా అవతారమెత్తనున్నాడు. గత యేడాది టీ20 ప్రపంచకప్ భారత జట్టుకు మార్గనిర్దేశం చేసిన ధోనీ.. ఇపుడు ఓ విదేశీ జట్టుకు మెంటర్‌గా కనిపించనున్నాడు.
త్వరలోనే మొదలయ్యే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఓ జట్టును కొనుగోలు చేసింది. దీనికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈ లీగ్ జట్టుకు ధోనీ మెంటరుగా వ్యవహరించే అవకాశం ఉంది.
నిజానికి భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ సూపర్ జట్టుగా తీర్చిదిద్దిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ జట్టుకు మెంటరుగాను ప్రధాన కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యవహరించే అవకాశం ఉంది.