నర్సరీ చిన్నారిపై స్కూలు బస్సు డ్రైవర్ అత్యాచారం.. ఎక్కడ?
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. నర్సరి చిన్నారిపై స్కూలు బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పాపను బడి నుంచి ఇంటికి తీసుకెళుతూ ఆ వాహనంలోనే అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇక్కడ ఘోరం ఏమిటంటే.. ఆ సమయంలో పిల్లల బాగోగులను చూసుకునే బాధ్యత ఉన్న మహిళా సంరక్షురాలు కూడా అదే బస్సులో ఉంది. ఆమె కూడా చిన్నారిపై అత్యాచారం చేసేందుకు డ్రైవర్‌కు తన వంతు సహకారం అందించింది.
ఆ తర్వాత తన ప్రైవేటు భాగాల్లో నొప్పి ఉందంటూ పాప చెప్పడంతో తల్లి ఆందోళనకు గురైంది. ఏం జరిగిందని తల్లి ప్రశ్నించగా బస్సులో తనపై లైంగిక దాడి జరిగిందని, దీనికి మహిళా సంరక్షకురాలు కూడా సహకరిందని చెప్పింది.
ఆ తర్వాత పాపతో కలిసి తల్లిదండ్రులు బడికి వెళ్లగా అక్కడే ఉన్న డ్రైవర్‌ను గుర్తించింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్, సంరక్షకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.