గురువారం, 28 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. రత్నాల శాస్త్రం
Written By Selvi
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (19:07 IST)

జ్యేష్ఠ 4వ పాదములో జన్మించిన వారైతే..?

జ్యేష్ఠ 4వ పాదములో జన్మించిన వారైతే..? జన్మించిన 4 సంవత్సరముల వయస్సు వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించగలరు. 4 సంవత్సరముల నుండి 11 సం.లు వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో పొదిగించుకుని ధరించగలరు. 
 
11 సంవత్సరముల నుంచటి 31 సం.లు వరకు శుక్ర మహర్దశ కావున వజ్రము బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు. 31 సం.లు నుంటి 37 సం.లు వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు. 
 
37 సంవత్సరముల నుంచి 47 సం.లు వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు. 47-54 సంవత్సరములు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు. 
 
54 సంవత్సరముల నుండి 72 సంవత్సరములు వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో మధ్య వేలుకు ధరించగలరని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.