శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జనరల్ నాలెడ్జ్
Written By ఎం
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (11:31 IST)

కొబ్బరికాయ రెండు ముక్కలే అవుతుంది.. ఎందుకు?

ఏదైనా ఘనపదార్థాన్ని పగలగొట్టాలంటే శక్తి కావాలి. ఎంత కావాలనేది ఆ వస్తువు గట్టిదనాన్ని బట్టి ఉంటుంది. అలా కొట్టేటప్పుడు వేగం, కాలం కూడా పరిగణనలోకి వస్తాయి.

ఎంత శక్తిని ఎంత కాలంలో ఎంత వేగంతో ఉపయోగించామో తెలిపేదే తాడనం (impact) అవుతుంది. గట్టిగా ఉండే కొబ్బరి కాయ పెంకు పగలాలంటే తాడన తీవ్రత అధికంగా ఉండాలి. అది పెంకులో పగుళ్లను తీసుకువస్తుంది.

దీని మీదనే పగులు విస్తారం (spread of crack) ఆధారపడి ఉంటుంది. కొబ్బరి కాయ ఎక్కువ ముక్కలవ్వాలంటే ఎక్కువ విస్తారపు పగుళ్లు కావాలి.

కానీ మనం సాధారణంగా ప్రయోగించే తాడన తీవ్రత కొబ్బరి కాయను కేవలం రెండు ముక్కల్నే చేయగలదు. అలా కాకుండా చాలా తీవ్ర శక్తితో నేలకేసి ఠపీమని కొడితే అది అనేకముక్కలవడాన్ని గమనించవచ్చు