గురువారం, 31 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: శనివారం, 29 జనవరి 2022 (22:10 IST)

కిడ్నీస్టోన్స్ బయటకు పంపగల జ్యూస్, ఏంటది?

ఇటీవలి కాలంలో కిడ్నీ స్టోన్స్ సాధారణమవుతున్నాయి. ఎక్కువ పనిగంటలు, శరీరానికి అవసరమైనంత నీరును అందించకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. కిడ్నీ స్టోన్ లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాం. 
నడుము భాగంలో తీవ్రమైన నొప్పి, పొత్తికడుపు నొప్పి, మూత్రవిసర్జనలో హెచ్చుతగ్గులు, మూత్రవిసర్జనలో మంట, గులాబీ, ఎరుపు లేదా తెలుపు మూత్రం, మూత్రంలో దుర్వాసన, తరచుగా మూత్రవిసర్జన వంటి లక్షణాలు కలిగి ఉంటాయి.

 
అంతేకాదు వికారం- వాంతులు, ఇన్ఫెక్షన్ తర్వాత చలి- జ్వరం లక్షణాలు కనబడితే మూత్రపిండాల్లో రాళ్లు వున్నట్లు అనుమానించాల్సి వుంటుంది. కిడ్నీ స్టోన్‌ను మందులతో తొలగించవచ్చు. అయితే ఈ లక్షణాలు తక్కువగా ఉంటే ఇంట్లోనే చికిత్స చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

 
ఆయుర్వేద శాస్త్రం- పరిశోధనల ప్రకారం ఒక వ్యక్తి మూత్రపిండాల్లో రాళ్లను వదిలించుకోవడానికి క్రమం తప్పకుండా నిమ్మరసం తాగాలి. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరం కాల్షియం నుండి రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. సిట్రిక్ యాసిడ్ రాయిని విచ్ఛిన్నం చేసి బయటకు పంపేస్తుంది.

 
నిమ్మరసంతో శరీరానికి చాలా ఉపయోగాలున్నాయి. లెమన్ వాటర్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటుంటే శరీరంలోని బ్యాక్టీరియా నాశనం అవుతుంది. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కనుక రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

 
ఆయుర్వేద శాస్త్రాలలో తులసికి చాలా ప్రాముఖ్యత వుంది. తులసి ఆకులలో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లను కరిగించి నొప్పిని తగ్గిస్తుంది. తులసి ఆకులలో శరీరంలోని జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి ఉపయోగించే అనేక పోషకాలు ఉన్నాయి.

 
శరీరంలో ఏదైనా రకమైన మంట ఉంటే, దానిని తులసి ఆకులతో కూడా తగ్గించుకోవచ్చు. తులసి ఆకు రసంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఐతే ఇవన్నీ కిడ్నీ స్టోన్స్ ప్రాధమిక దశలో వున్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. వ్యాధి ముదిరినప్పుడు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాల్సిందే.