ప్రతిరోజూ చికెన్ తినవచ్చా? తింటే ఏమవుతుంది?
మాంసాహారం అంటే చాలామందికి మక్కువ. అందులోనూ కొందరు చికెన్‌ను రకరకాల వెరైటీల్లో రుచి చూస్తుంటారు. ఐతే రోజూ చికెన్ తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసుకుందాము. రోజూ చికెన్ తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రోజూ చికెన్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. రోజూ చికెన్ తింటే కీళ్లనొప్పులు వంటి సమస్యలు చాలా త్వరగా వస్తాయి.
రోజూ చికెన్ తింటే శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల ముక్కు నుంచి రక్తం కారడం, మొటిమలు వంటి సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ చికెన్ తినేవారు, ఈ పద్ధతికి స్వస్తి చెప్పి వారానికి రెండు రోజులు తినడం మంచిది.