1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2022 (19:44 IST)

ఏ వయసు వారికి ఎంతెంత నిద్ర కావాలి? (video)

sleep
నిద్ర అనేది మానవ జీవితంలో చాలా ముఖ్యమైనది. ఒక్కరోజు నిద్రపోకుండా వున్నారంటే దాని ఎఫెక్ట్ వారం రోజుల పైగానే పడుతుందని పెద్దలు అంటుంటారు. ఇక అసలు విషయానికి వస్తే ఆరోగ్యకరమైన నిద్ర ఎన్నిగంటలైతే సరిపోతుంది. యువకులకు, పెద్దలకు, 7నుంచి 9 గంటల పాటు నిద్రపోతే సరిపోతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

 
ఎవరెవరికి ఎంతెంత నిద్ర కావాలో చూద్దాం.
నవజాత శిశువులకు 14-17 గంటలు అవసరం
శిశువులకు 12-15 గంటలు అవసరం
పసిపిల్లలకు 11-14 గంటలు అవసరం
ప్రీస్కూలర్లకు 10-13 గంటలు అవసరం
పాఠశాల వయస్సు పిల్లలకు 9-11 గంటలు అవసరం
యువకులకు 8-10 గంటలు అవసరం
పెద్దలకు 7-9 గంటలు అవసరం
వృద్ధులకు 7-8 గంటలు అవసరం