రెండుమూడు తాజా పుదీనా ఆకులను నమిలితే... video
పుదీనా పాలీఫెనాల్స్ గొప్ప మూలం. ఇది సుగంధ వాసన, మంచి రుచిని కలిగి ఉంటుంది.
పుదీనా జీర్ణక్రియకు సహాయపడుతుంది. పుదీనా ఆకులను నమలడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. పుదీనా మాత్రలు, పుదీనా చుక్కలు కూడా అజీర్ణ సమస్యను నిరోధించేందుకు సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్ గుణం వల్ల మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఇందులోని నూనెలు వాటి శీతలీకరణ తత్వం కారణంగా పంటి నొప్పిని తగ్గించే గుణాలను కలిగి వుంది. పుదీనా టీని రోజూ తాగడం వల్ల యాంటీఆక్సిడెంట్ గుణాల వల్ల జీవక్రియ మెరుగుపడటం ద్వారా బరువు తగ్గవచ్చు.
పుదీనా లీఫ్ పౌడర్ రోజ్ వాటర్‌తో పాటు చర్మంపై పూసినప్పుడు మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. తాజా పుదీనా లీఫ్ పేస్టును చర్మంపై పూయడం వల్ల యాంటీమైక్రోబయాల్ ప్రాపర్టీ వల్ల చర్మ వ్యాధులను నిరోధించవచ్చు.