శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (13:55 IST)

ఉప్పుకు ప్రత్యామ్నాయం రాక్ సాల్ట్ ... వాడితే ఉపయోగాలెన్నో?

చేసిన వంట రుచికరంగా ఉండాలంటే ఖచ్చితంగా అందులో చిటికెడు ఉప్పు వేయాల్సిందే. ఉప్పు లేకపోతే అది ఎలాంటి కూరైనా సరే ఆరగించలేం. అదే ఉప్పు ఎక్కువైతే ముప్పు తప్పదు. హైబీపీ, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంది

చేసిన వంట రుచికరంగా ఉండాలంటే ఖచ్చితంగా అందులో చిటికెడు ఉప్పు వేయాల్సిందే. ఉప్పు లేకపోతే అది ఎలాంటి కూరైనా సరే ఆరగించలేం. అదే ఉప్పు ఎక్కువైతే ముప్పు తప్పదు. హైబీపీ, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇక బీపీ రోగులు అయితే ఉప్పును చాలా తక్కువగా తినాల్సి ఉంటుంది.
 
కానీ.. ఇపుడు అలాంటి బాధలు పడాల్సిన అక్కర్లేదు. ఉప్పుకు ప్రత్యామ్నాయంగా సైంధవ లవణం లేదా రాక్ సాల్ట్ (స్వచ్ఛమైన ఉప్పు)ను చెప్పుకోవచ్చు. ఇందులో 84 రకాల పోషకాలు ఉన్నాయి. వీటిని వాడితో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. 
 
పైగా మనం నిత్యం వాడే ఉప్పుకంటే సైంధవ లవణం ఎంతో తక్కువగా అవసరమవుతుంది. అంటే 3 టీస్పూన్ల ఉప్పు వాడే బదులు 2 టీస్పూన్ల సైంధవ లవణం వాడితే చాలన్నమాట. అలాంటి సైంధవ లవణం ఉపయోగాలను తెలుసుకుందాం. 
 
* ఈ స్వచ్ఛమైన ఉప్పును వాడటం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దేహానికి శక్తినిస్తుంది. నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. దంత సమస్యలను మటుమాయం చేస్తుంది. 
* ఈ లవణంలో కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నిషియం, పాస్ఫరస్, పొటాషియం, సిలికాన్, సల్ఫర్, జింక్, అయోడిన్ తదితర పోషకాలు ఉన్నాయి. 
* తులసి ఆకుల పొడి, సైంధవ లవణం కలిపి దంతాలను తోముకుంటే దంతాల నొప్పి, చిగుళ్ల నొప్పి, నోటి దుర్వాసన సమస్యలు దూరమవుతాయి. 
 
* స్నానం చేసే నీటిలో కొద్దిగా సైంధవ లవణం వేసి, ఆ నీటితో స్నానం చేయడం వల్ల శరీరం నుంచి దుర్గంధం వెలువడకుండా ఉంటుంది.
* ఎముకలను దృఢంగా ఉంచడంలో, జీర్ణ సమస్యలను నయం చేయడంలో ఇది బాగా పని చేస్తుంది. 
 
* సైంధవ లవణాన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల కీళ్లనొప్పులకు, నపుంసకత్వ సమస్యను అధికమించవచ్చు. 
* వాము, సైంధవ లవణం కలిపి తింటే స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. 
* ఎండు ద్రాక్షను నెయ్యిలో వేయించి సైంధవ లవణం కలిపి తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
 
* మజ్జిగలో సైంధవ లవణం కలిపి తాగితే అజీర్ణ సమస్య చిటికెలో పోతుంది. 
* జీలకర్ర, సైంధవ లవణం కలిపి తింటే వాంతులు తగ్గుతాయి. 
* సైంధవ లవణం, పసుపు, శొంఠిపొడి కలిపి అన్నంలో తింటే ఆకలి పెరుగుతుంది.
 
* తులసి ఆకుల కషాయంలో సైంధవ లవణం కలిపి తాగితే తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. 
* నిమ్మరసంలో సైంధవ లవణం కలిపి తాగితే మూత్ర పిండాల్లో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి. 
* అల్లం రసం, సైంధవ లవణం కలిపి భోజనానికి ముందు తింటే అజీర్ణం తగ్గుతుంది.