అవతార్‌-2 2021 డిసెంబర్ 17న విడుదల.. అవతార్ సిరీస్ కొనసాగుతాయ్!

Avatar 2
సెల్వి| Last Updated: శుక్రవారం, 24 జులై 2020 (10:53 IST)
Avatar 2
''అవతార్'' హాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించిన సంగతి తెలిసిందే. కెనడియన్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌, స్క్రీన్‌రైటర్‌ జేమ్స్‌ కామెరూన్‌ ఇప్పటివరకు 33 సినిమాలు తీయగా అందులో 'అవతార్‌' ఆయనకు మంచి క్రేజ్ సంపాదించి పెట్టింది. ఈ సినిమా సీక్వెల్స్‌కి సంబంధించి కొన్నాళ్ళుగా పనులు జరుగుతుండగా, కరోనా వలన మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. ఇటీవల న్యూజిలాండ్ మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టారు.

ఈ నేపథ్యంలో అవతార్‌-2 సినిమాను డిసెంబర్‌ 17న విడుదల చేయనున్నట్టు ఇదివరకే జేమ్స్‌ కామెరూన్‌ ప్రకటించారు. అవతార్‌-2తో సీక్వెల్‌ ప్రయాణాన్ని ముగించకుండా అవతార్‌-3, అవతార్‌-4, అవతార్ 5 సినిమాలు కూడా నిర్మించాలని కూడా భావిస్తున్నట్టు వెల్లడించారు జేమ్స్‌ కామెరూన్‌. తాజాగా డిస్నీ సంస్థ అవతార్ సీక్వెల్స్‌కి సంబంధించిన రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు.

అవతార్ 2 చిత్రం ముందుగా 2021 డిసెంబర్ 17న విడుదల అవుతుందని ప్రకటించగా, తాజాగా ఏడాది వాయిదా వేస్తూ డిసెంబర్ 16, 2022న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక అవతార్ 3 చిత్రం డిసెంబర్ 20, 2024న అవతార్ 4 చిత్రం డిసెంబర్ 18, 2026న, అవతార్ 5 చిత్రం డిసెంబర్ 22, 2028న రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు.దీనిపై మరింత చదవండి :