బుధవారం, 9 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 27 మార్చి 2023 (23:28 IST)

తేనెను వాడకూడని సందర్భాలు ఏమిటో తెలుసా?

తేనె అనగానే అది ఎంతో ఆరోగ్యం అని తీసుకుంటుంటారు. కానీ ఆ తేనెను వాడకూడని సందర్భాలు వున్నాయన్నది తెలుసా? ఎప్పుడు వాడకూడదో తెలుసుకుందాము. తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు. అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి నేరుగా వాడకూడదు. తేనె ఉష్ణ వీర్య పదార్థం కాబట్టి తేనెను నేరుగా మంటపైన వేడిచేయకూడదు. తేనెను వేడి వాతావరణంలోనూ, వేసవిలో పరిమితంగా వాడాలి, తేనెలో రకరకాల పువ్వుల మకరందాల అంశ ఉంటుంది.
 
మసాలా పదార్థాలతోనూ, మద్యంతోనూ, ఆవనూనె వంటి పదార్థాలతో తేనెను కలపకూడదు.
తేనెను వర్షం నీళ్లతో కలిపి వాడకూడదు, తేనెను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడరాదు, ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. తేనెను, నెయ్యిని సమాన భాగాలుగా తీసుకోకూడదు. ఇది విరుద్ధం.