సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (11:06 IST)

నైజీరియాలో భారీ పేలుడు - 100 మంది మృతి

Oil Refinery Blast
నైజీరియా దేశంలోని  ఓ చమురుశుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో దాదాపు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ముడి చమురు శుద్ధి కేంద్రంలో చెలరేగిన మంటలు ఇవి క్రమంగా వ్యాపించి మరో రెండు చమురు నిల్వ కేంద్రాలకు వ్యాపించాయి. దీంతో ప్రాణనష్టం అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారంతా ఆపరేటర్లేనని వెల్లడించారు. చమురుశుద్ధి కేంద్రం యజమాని కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. నైజీరియాలో ఉద్యోగాలు లభించని అనేక మంది యువతు చమురు శుద్ధి కేంద్రాలను సొంతంగా ఏర్పాటు చేసుకోవడం లేదా ఈ తరహా కర్మాగారాల్లో పని చేస్తున్నారు. ఇలాంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి.