మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 మార్చి 2022 (15:24 IST)

ధోనీ అభిమానులకు చేదువార్త.. చెన్నై కెప్టెన్సీకి ధోని గుడ్‌బై!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూల్ కెప్టెన్‌గా పేరున్న ధోనీ అభిమానులకు చేదువార్తే చెప్పారని అనుకోక తప్పదు. అంతర్జాతీయ క్రికెట్‌లో లేకపోయినా ధోనీ ఐపీఎల్‌లో వుంటే చాలునని, ఐపీఎల్ చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వుంటే చాలునని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ ఆ ఫ్యాన్సుకు షాకిచ్చే నిర్ణయాన్ని ధోనీ తీసుకున్నారు. 
 
అదేంటంటే ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్రసింగ్ ధోనీ తప్పుకున్నాడు. మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ధోనీ నిర్ణయం ఫ్యాన్సుకు షాకిచ్చింది. 
 
ఇకపోతే.. ఐపీఎల్ కానుండగా.. తొలి మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టబోతోంది. కానీ.. తొలి మ్యాచ్‌ ముంగిట కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేతికి టీమ్ పగ్గాలిస్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ప్రకటించింది. 
 
ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. ఆ జట్టుని ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. ఇంకేముంది.. కెప్టెన్సీ నుంచి వైదొలగినా.. చెన్నై ఆటగాడిగా ధోనీ దంచేస్తాడంటూ ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు