శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (10:47 IST)

5జి స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లో 22 శాతం వృద్ధిరేటు

దేశంలో 5జీ రకం స్మార్ట్ ఫోన్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ ఈ ఫోన్ల విక్రయాల్లో ఏమాత్రం తగ్గుదల కనిపించలేదు. పైగా, ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 5జి స్మార్ట్ ఫోన్ల విక్రయాలు ఏకంగా 22 శాతం మేరకు పెరిగినట్టు సీఎంఆర్ నివేదిక వెల్లడించింది. 
 
ఈ సంస్థ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం ఇండియా మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్ రివ్యూ రిపోర్ట్ 2021 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నివేదిక ప్రకారం ఈ త్రైమాసికంలో 5జీ సామార్థ్యం కలిగిన స్మార్ట్ ఫోన్లను కొత్తగా ఆవిష్కరించారు. 
 
ఈ రకం మొబైళ్ళ ధర కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఈ  ఫోన్లను తయారు చేస్తున్నారు. పైగా, డిమాండ్‌కు తగిన విధంగా ఈ ఫోన్ల తయారీతో పాటు.. లభ్యత కూడా ఉందని ఆ నివేదిక వెల్లడించింది.