శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : గురువారం, 18 జులై 2019 (15:30 IST)

#faceappchallenge ఎలా వచ్చింది..? FaceApp ఎలా ట్రెండ్ అయ్యిందంటే?

ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో ప్రారంభమై.. కికి ఛాలెంజ్, బాటిల్ ఛాలెంజ్, నేసమణి వంటివి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వచ్చాయి. ఇలాంటివి ఎన్నెన్నో ట్రెండ్ అయి హ్యాష్‌ ట్యాగులతో.. మీమ్స్ ద్వారా చక్కర్లు కొట్టిన సందర్భాలున్నాయి. తాజాగా ఇలాంటి ఛాలెంజ్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రపంచ కప్ ముగిసిన నేపథ్యంలో ధోనీ రిటైర్మెంట్‌పై ప్రచారం సాగుతోంది. 
 
అలాగే ఫేస్ ఛాలెంజ్ అనేది తెరపైకి వచ్చింది. ముందుగా 2050లో ఆడే ప్రపంచకప్‌లో టీమిండియా ఆటగాళ్లు ఎలా వుంటారనే ఫోటోలు నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
అలాగే ప్రస్తుతం కేన్ విలియమ్సన్, క్రిస్ గేల్ వంటి విదేశీ ఆటగాళ్లు వయస్సు మళ్లాక ఎలా వుంటారనే ఊహాచిత్రాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోనీ, భువనేశ్వర్, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజాల ఫోటోలు నెట్టింట భారీగా షేర్ అవుతున్నాయి. 
 
అసలు ఫేస్ యాప్ అంటే ఏమిటో తెలుసుకుందాం.. 
ఫేస్‌యాప్ అనేది ప్రస్తుతం 25 ఏళ్ల వ్యక్తిని 50 ఏళ్లున్నప్పుడు ఎలా వుంటారో ముఖ చిత్రం ద్వారా చెప్పేస్తుంది. రష్యాకు చెందిన డెవలపర్స్ దీన్ని రూపొందించారు. మీ ఫోటోల ఆధారంగా మీ ముఖాన్ని ఇది ఫిల్టర్ చేలి చూపెట్టేస్తుంది. భద్రతా కారణాల రీత్యా ఫేస్ యాప్‌ను ఉపయోగించవద్దని 2017లో పరిశోధకులు హెచ్చరించారు. 
 
మీ ఫోటోను మీ అనుమతి లేకుండానే ఈ ఫేస్ యాప్ ద్వారా ఈ చిత్రాన్ని మార్చవచ్చు.  ప్రస్తుతం సోషల్ మీడియాకున్న క్రేజ్ ద్వారా ఫేస్ యాప్‌ను నెటిజన్లు తెగ వాడేస్తున్నారు. ఫేస్ యాప్ అనేది ఫోటో-మార్ఫింగ్ యాప్. దీన్ని ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్, న్యూరల్ ఫేస్ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం ఉపయోగిస్తారు. ఈ యాప్ ద్వారా మీ ఫోటోలను మార్ఫింగ్ చేయడం సులభం. 
 
ఇంకా ప్రస్తుతం యుక్తవయస్సులో వుంటే వృద్ధాప్యంలో ఎలా వుంటారో కూడా చెప్పేస్తుంది. ముఖాన్ని, హెయిర్ స్టైల్‌ని ఇదే మార్చేస్తుంది. మీ గ్యాలెరీలోని ఫోటోలను సెలక్ట్ చేసుకుని మార్ఫింగ్‌తో ఊహాజనిత ఫోటోలను ఇచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ యాప్‌ను ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం #faceappchallenge అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ యాప్ ట్రెండ్ అవుతోంది.