శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (22:49 IST)

మహాశివరాత్రిపై జ్యోతిష్య శాస్త్రం ఏమంటుందంటే?

ఈ ఏడాది శివరాత్రి పండుగ మార్చి 1న రానుంది. మహాశివరాత్రిపై జ్యోతిష్యం ప్రకారం వున్న ప్రాధాన్యత ఏంటంటే..? చతుర్దశి తిథికి అధిపతి శివుడే. జ్యోతిష్యం  ప్రకారం ఈ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.  
 
జ్యోతిష్యశాస్త్రంలోని గణాంకాల ప్రకారం, సూర్యుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు, సీజన్ మార్పు కూడా కొనసాగినప్పుడు శివరాత్రి జరుగుతుంది. పధ్నాలుగవ రోజున చంద్రుడు బలహీనుడవతాడని జ్యోతిష్యం చెబుతుంది. 
 
శివుడు తన తలపై చంద్రుడిని ధరిస్తాడు కావున, ఆ రోజున అతనిని ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుంది. శివారాధనతో చంద్రుడిని శక్తివంతం చేస్తుంది. చంద్రుడు మనస్సుకు సంకేతం కాబట్టి, ఇది అదనపు ప్రయోజనాన్ని ఇస్తుంది. 
 
ఇంకా చెప్పాలంటే, శివుడిని ఆరాధించడం సంకల్పశక్తికి బలాన్ని ఇస్తుంది. భక్తుడిలో అజేయమైన శౌర్యాన్ని అదేవిధంగా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
 
ఈ రోజున శివపురాణాన్ని పఠించి మహామృత్యుంజయ లేదా శివ పంచాక్షరి ఓం నమః శివయ మంత్రాన్ని పఠించాలి. అదనంగా, శివరాత్రి రాత్రంతా జాగరణ చేయాలి.