పాల ట్యాంకర్‌ను ఢీకొన్న డబుల్ డెక్కర్ బస్సు.. 18 మంది మృత్యువాత
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ఉన్నావ్ వద్ద పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా 18 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. బుధవారం ఉదయం 5.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లక్నో - ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ డబుల్ డెక్కర్ బస్సు బీహార్ నుంచి ఢిల్లీ వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడినవారిని బంగార్‌మావ్ సీహెచ్‌సీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.