శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (10:09 IST)

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు : ఆమ్ ఆద్మీ షో

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతున్నాయి. మొత్తం 117 అసెంబ్లీ సీట్లకు గాను ఒకే దశలో ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టారు. ఇందులో మొత్తం ఉదయం 10 గంటల వరకు వెల్లడైన ట్రెండ్స్ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 84 సీట్లలో ఆధిక్యంలో ఉంది. 
 
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 18 సీట్లలో, అకాలీదళ్ 4, బీజేపీ మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఈ ట్రెండ్స్‌ను చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు ఖాయమైందని చెప్పొచ్చు. అయితే, ఈ ఎన్నికల్లో హేమా హెమీలు దారుణంగా విఫలమైనట్టు తెలుస్తుంది. 
 
లంబీ స్థానం నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ వెనుకంజలో ఉన్నారు శిరోమణి అకాలీదళ నేత గనివీ కౌర్ మంజిత ఆధిక్యంలో ఉన్నారు. తాజా ఫలితాల మేరకు 84 చోట్ల ఆప్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పాటియాలా అర్బన్ స్థానం నుంచి పోటీ చేసిన పంజా మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా వెనుకంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓటల్లు దరికి చేరనివ్వలేదు.